Inter Exams : నిమిషం ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు, గేటు బయట ముగ్గురు ఇంటర్ విద్యార్థులు..!
Inter Exams : నిమిషం ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు, గేటు బయట ముగ్గురు ఇంటర్ విద్యార్థులు..!
దేవరకొండ, మనసాక్షి:
నిమిషం ఆలస్యంగా రావడంతో ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులను అధికారులు అనుమతించకపోవడం వల్ల గేటు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..
దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు ముగ్గురు విద్యార్థులు నిమిషం ఆలస్యమై రావడంతో లోపలికి అనుమతించలేదు. విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి సి.ఎస్,డి.ఓ లను రిక్వెస్ట్ చేసినప్పటికి ఎగ్జామ్ సెంటర్ లోనికి అనుమతించలేదు. విద్యార్ధులు చేసేది ఏమి లేక తిరిగి ఇంటికి వెళ్ళి పోయారు.
విద్యార్థులు మాట్లాడుతూ దేవరకొండ మారుమూల ప్రాంతంలో సమయానికి బస్సులు రాక,వాహనాలు లేక పోవడం తో ఆలస్యం అయ్యింది అన్నారు విద్యార్థులు.చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటోలు బైకులు ను మాట్లాడుకొని పరీక్ష కేంద్రం వరకు రావడం జరిగింది,వచ్చేసరికి నిమిషం ఆలస్యమైనందుకు లోనికి అనుమతించలేదు అని విద్యార్థులు వాపోయారు.
ALSO READ : BANDLA GANESH : కేటీఆర్ అమెరికా వెళ్ళింది అందుకే.. కేటీఆర్, రోజా పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!









