Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆదిలాబాద్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Revanth Reddy : ఎన్టిపిసి లో 80% విద్యుత్ మాకే ఇవ్వాలి.. రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : ఎన్టిపిసి లో 80% విద్యుత్ మాకే ఇవ్వాలి.. రేవంత్ రెడ్డి..!

ఆదిలాబాద్, మన సాక్షి :

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం నిర్వహించే సభలో రేవంత్ రెడ్డి సైతం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 5 మిలియన్ ఎకానమీ లక్ష్యంలో హైదరాబాద్ కూడా భాగస్వామ్యం అవుతుందన్నారు.

కేంద్రంతో సఖ్యతతో ఉంటామని స్పష్టం చేశారు. ఎన్ టి పి సి కి విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, 80% విద్యుత్తు తెలంగాణకు ఇవ్వాలని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణకు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసినందున ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం మేము కోరుకోమని సఖ్యతతో ఉంటామని ఆయన తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఆ తర్వాత అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ALSO READ : Modi : తెలంగాణలో రూ.6697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోడీ..!

 

మరిన్ని వార్తలు