Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Congress Party : రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శక్తి వంచనతో కృషి చేయాలి..!

Congress Party : రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శక్తి వంచనతో కృషి చేయాలి..!

కుందూరు రఘువీర్ రెడ్డి

చింతపల్లి, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేశారని టి పి సి సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయకులు అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని పి పి ఆర్ ఫంక్షన్ హాల్ లో యువజన కాంగ్రెస్ యువ సమ్మేళనం యువజన కాంగ్రెస్ దేవరకొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తండ్రి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కి దేవరకొండ నియోజకవర్గం లో ని ప్రతి ఒక్క కార్యకర్త నుండి నాయకుల వరకు సత్ బంధాలు కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే బాలునాయకు లాంటి వ్యక్తిని తయారు చేసింది జానారెడ్డి అన్నారు. రాబోవు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అభ్యర్థి ఎవరైనా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు శక్తివంచన లేకుండా గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

ALSO READ : BIG BREAKING : పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు మృతి.. మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను వివరిస్తూ తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని వారు తెలిపారు. తన గెలుపుకు 32వేల ఓట్లు మెజార్టీ చూపించిన విధంగానే పార్లమెంటు సభ్యుడు 5 లక్షల పైగా మెజార్టీ చూపించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే జానారెడ్డి జానారెడ్డి అంటేనే కాంగ్రెస్ అని ఆయన మేధస్సు కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు ఆయన శిష్యరికంలో ఎదిగిన ప్రతి నాయకుడు కార్యకర్త ఉన్నత స్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా కార్యకర్తలకు గుర్తు చేశారు.  జానా రెడ్డి లాంటి ఉత్తమ నాయకుడు నల్లగొండ జిల్లాకు ఉండటం మన అందరి అదృష్టం అన్నారు.

ALSO READ : అమ్మాయి కిడ్నాపు.. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు..!

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొర్ర రామ్ సింగ్ నాయక్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, ఈ కార్యక్రమంలో పరిశీలకులు అరుణ్ మీర్జా, నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరీ రాజా రమేష్ యాదవ్, పీసీసీ సభ్యులు చాలా నరసింహారెడ్డి పార్లమెంట్ కన్వీనర్ ఎంఏ సిరాజ్ ఖాన్, ముక్కామల వెంకటయ్య, పున్న వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నరసింహ, వడ్త్యా దేవేందర్ నాయక్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జరుపుల లక్ష్మి కొర్ర గౌతమి, సుర్జిత్యాదవ్,నాగరాజు,అంబేద్కర్, రమేష్, సేవ వెంకటయ్య వివిఆర్ పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యువజన సంఘ నాయకులు ఎన్ ఎస్ ఏ సంఘ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

మరిన్ని వార్తలు