Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : పండుగ రోజు విషాదం.. టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకుల మృతి..!

BREAKING : పండుగ రోజు విషాదం.. టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకుల మృతి..!

అర్వపల్లి మార్చి 8 మన సాక్షి

మహాశివరాత్రి పండుగ రోజు ఆ కుటుంబాన్ని తీరని విషాదంలో ముంచింది సెలవు రోజు కావడంతో పిల్లలు ఆడుతున్న క్రికెట్ ఆటలు చూస్తున్న తండ్రి కొడుకుల పై తప్ప తాగి ఉన్న టిప్పర్ డ్రైవర్ టిప్పర్ ని ఎక్కించడంతో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బొల్లంపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
మృతుని బంధువులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గద్దగూటి జానయ్య (36 ) అతని కొడుకు గద్దగూటి విగ్నేష్( 12) గ్రామంలోని ఐకెపి కేంద్రంలో క్రికెట్ ఆడుతున్న ఆటను తిలకిస్తుండగా, అదే గ్రామానికి చెందిన బొడ్డు శేఖర్ అనే వ్యక్తి తన పని చేస్తున్న కంకర మిల్లు నుండి టిప్పర్ను తెచ్చి క్రీడా ప్రాంగణంలో నిలిపినట్లు తెలిపారు.

తాగిన మైకంలో పక్కకు పెట్టే సందర్భంగా క్రికెట్ విక్షిస్తున్న తండ్రి కొడుకుల పై ఎక్కించడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య సుజాత కొడుకు కూతురు ఉన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సెలవు కావడంతో టిప్పర్ను తన గ్రామానికి తెచ్చిన వ్యక్తి తప్ప తాగి ఇద్దరిని చంపేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మరిన్ని వార్తలు