Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా..!

Suryapet : తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా..!

సూర్యాపేట, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజని రాజశేఖర్ తన పదవితో పాటు 5వ వార్డ్ కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం జిల్లా కలెక్టర్ కు పంపారు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి సమర్పించి తీర్మానపత్రం అందజేసిన విషయం విధితమే.

అయితే జిల్లా కలెక్టర్ ఈనెల 20వ తేదీన అవిశ్వాసం తేదీని ప్రకటించారు. ఈ తరుణంలో చైర్ పర్సన్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడం మున్సిపాలిటీలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం తొ తన పదవి కోల్పోయే అవకాశం ఉండడం తోనేముందస్తు గా ఆమె రాజీనామా చేశారని ఆరోపిస్తున్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు