Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Telangabna : పార్లమెంట్ ఎన్నికలకు కెసిఆర్ కుటుంబం దూరం.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

Telangabna : పార్లమెంట్ ఎన్నికలకు కెసిఆర్ కుటుంబం దూరం.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంతరించుకున్నాయి. గత 20 సంవత్సరాలలో లేని రాజకీయం ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో చూడబోతున్నాము. లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంది. గత 20 సంవత్సరాలలో ఇదే తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాటి నుంచి కూడా జరిగిన లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం వారి కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.

మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలని సవాల్ విసిరిన కేటీఆర్ కూడా వెనుకడుగు వేశారు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం సభ్యుడైన సంతోష్ కుమార్ పదవి కాలం కూడా వచ్చేనెల రెండవ తేదీతో ముగియనున్నది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న జోగినపల్లి సంతోష్ కూడా పార్లమెంటుకు పోటీ చేయకపోవడం చర్చనీయంశంగా ఉంది. పార్టీ సంక్షోభంలో కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యులు కూడా లోకసభ ఎన్నికల బరిలో నిలవకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్లంతా లోక్ సభకు దూరంగా ఉండటం… కవిత ఈ డి కస్టడీలో ఉండడం.. పార్టీ కష్ట కాలంలో ఉంది. ఓడినా.. గెలిచినా.. కూడా లోకసభ ఎన్నికల బరిలో నిలబడి పార్టీకి క్యాడర్ కు ధైర్యం ఇవ్వాల్సిన కుటుంబ సభ్యులు పోటీలో నిలబడకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రతిసారి పోటీలోనే..

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ప్రతిసారి కూడా కేసీఆర్ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తూనే వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తూ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చింది. 2004 లో కెసిఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

2014 ఎన్నికల్లో కెసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి లోకసభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల కూడా గెలుపొందారు. ఆ తర్వాత ఎంపీ స్థానానికి రాజీనామా చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉంటూనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లోనే కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 లోకసభ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు