Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Check Post : చెక్ పోస్ట్ ల వద్ద నిరంతర నిఘా.. డిఎస్పీ ప్రసాద్ రెడ్డి..!

Check Post : చెక్ పోస్ట్ ల వద్ద నిరంతర నిఘా.. డిఎస్పీ ప్రసాద్ రెడ్డి..!

రామసముద్రం, మన సాక్షి

మండలంలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అనప్పల్లె కొత్తూరు కురిజల చెక్ పోస్ట్ లను ఆదివారం డి ఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ సద్గురుడు, ఎస్సై చంద్రశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు, చెక్ పోస్ట్ సిబ్బందికి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించాలని చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు,

సీఐ,ఎస్సై లకు పలు సలహాలు సూచనలు చేశారు, రానున్న ఎన్నికల నేపథ్యంలో అక్రమమద్యం, అక్రమనగదు రవాణా జరగకుండా ఉండేందుకు గాను చర్యలు గూర్చి చర్చించారు, ఈసందర్బంగా మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధిక మొత్తంలో నగదు, మద్యం, మత్తు పదార్తా లు, విలువైన వస్తువులు అక్రమ రవాణాపై పటిష్ట నిఘాఉంటుందని నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు

రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్ళకూడదని తప్పనిసరైతే అందుకు సంబందించిన సరైన ఆధారాలు ఉండాలని లేకుంటే నిబంధనలమేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, నావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయాని తెలిపారు,ఈకార్యక్రమంలో డి ఎస్పీ ప్రసాద్ రెడ్డి సీఐ, సద్గురుడు ఎస్సై చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ :

Admissions : ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు దరఖాస్తుల స్వీకరణ..!

మరిన్ని వార్తలు