Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

CMR : ఏప్రిల్ నెలాఖరులోగా సీఎంఆర్ చెల్లింపు పూర్తి చేయాలి..!

CMR : ఏప్రిల్ నెలాఖరులోగా సీఎంఆర్ చెల్లింపు పూర్తి చేయాలి..!

మిల్లర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరిచంద్ర

మిర్యాలగూడ, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023- 24 వానకాలం కష్టం మిల్లింగ్ రైసు (సి ఎం ఆర్) చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రైస్ మిల్లర్లతో కోరారు.
గురువారం ఆమె మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 2023- 24 వానకాలానికి సంబంధించిన సీఎంఆర్ ప్రతిరోజు 4000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, అలాకాకుండా తక్షణమే సి ఎం ఆర్ ను 100 శాతానికి పెంచాలని అన్నారు.

ఇంకా 1,86,000 మె. టన్నుల సిఎంఆర్ ఇవ్వాల్సిందని తెలిపారు. రైస్ మిల్లర్లు సాధ్యమైనంత త్వరగా ఈ సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేస్తే ఈ సీజన్లో రానున్న రైస్ ను నిలువ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు .ఈ విషయమై డిప్యూటీ తాసిల్దార్లు మిల్లుల వారిగా పర్యవేక్షించాలని ఆదేశించారు .ఎట్టి పరిస్థితులలో మిల్లర్లు వారి సిఎంఆర్ చెల్లింపు సామర్థ్యాన్ని పెంచాలన్నారు.

2023- 24 యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం తీసుకోవాలని, ప్రత్యేకించి సన్నధాన్యం కొనడంలో రేట్లు పెంచడం లేదా తగ్గించడం చేయవద్దని కోరారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ పద్మశ్రీ రైస్ మిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను సందర్శిం సీఎంఆర్ ను పరిశీలించారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఆర్డిఓ శ్రీనివాస్ రావు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు శ్రీనివాస్, నల్గొండ అధ్యక్షులు నారాయణ , పౌరసరఫరాల శాఖ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ALSO READ : Nalgonda : ఇజ్రాయిల్ లాంటి ఎడారి దేశంలో 10, 15 రకాల పంటలు పండిస్తున్నారు..!

మరిన్ని వార్తలు