Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

BIG BREAKING : ఎస్‌బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 6 మృతి.. 10 మందికి గాయాలు..!

BIG BREAKING : ఎస్‌బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 6 మృతి.. 10 మందికి గాయాలు..!

హత్నూర మండలంలో ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది..

హత్నూర, మన సాక్షి :
సంగారెడ్డి9 జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులో ఎస్బీ ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో అరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారిని కంపెనీ డైరెక్టర్ రవి శర్మ, ప్రొడక్షన్ ఇంచార్జ్‌లు సుబ్రహ్మణ్యం, దయానంద్, మెయింటెనెన్స్ ఇంచార్జ్ సురేష్ పాల్‌లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

 

వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పి రూపేష్ తన సిబ్బంది పోలీసులు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కంపెనీ ఎదుట మృతుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రమాద సమయంలో కాపాడాలంటూ మంటల్లో చిక్కుకున్న కార్మికులు ఆర్తనాదాలు పెట్టారు.

 

ప్రమాదం సమయంలో వందల మీటర్ల దూరంలో మృతదేహాలు ఎగిరి పడ్డాయి . రియాక్టర్ పేలడంతో మూడు భవనాలు కూలిపోయాయి. పరిశ్రమలో మరో రియాక్టర్‌కు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో మరో రియాక్టర్ పేలే చాన్స్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను హుటాహుటిన పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

ALSO READ : Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!

మరిన్ని వార్తలు