Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురంగారెడ్డి

Marakatha Shivalayam : కోరికలు తీర్చే కొంగు బంగారం మరకత శివాలయం..!

Marakatha Shivalayam : కోరికలు తీర్చే కొంగు బంగారం మరకత శివాలయం..!

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

శంకర్‌పల్లి: (మన సాక్షి):

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం మరకత శివాలయం అని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకుని మరకత శివాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ సదానందం గౌడ్ జ్యోతికి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, ప్రవీణ్ కుమార్, రఘునందన్ రెడ్డి మణికంఠ, నాగరాజు, హనుమంతు, రమ్య రెడ్డి, ప్రత్యూష ఉన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు