Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజగిత్యాల జిల్లావిద్య

Latest News : వడదెబ్బతో ఎంఈఓ మృతి..!

Latest News : వడదెబ్బతో ఎంఈఓ మృతి..!

నివాళులర్పించిన పిఆర్టియు నాయకులు.

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి, ధర్మపురి, బుగ్గారం మండలాల విద్యాధికారి బత్తుల భూమయ్య వడ దెబ్బ తగిలి శనివారం ఉదయం మృతి చెందారు. పిఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్నాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద రావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమయ్య సేవలు మరువలేని అని అన్నారు.

ఇంకా వారి వెంట వెల్గటూర్ మండల అధ్యక్షులు నర్సింగమ్ , అసోసియేట్ అధ్యక్షులు జోగం శ్రీనివాస్, శంకర్, శేఖర్, కుమారస్వామి, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమర్ నాథ్ రెడ్డి, ఆనంద్ రావు లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొని వడదెబ్బ తగిలి మరణించిన భూమయ్య కుటుంబానికి ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోలింగ్ స్టేషన్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని అమర్నాథ్ రెడ్డి, ఆనందరావు లు కోరారు.

ALSO READ : 

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు