Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆదిలాబాద్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Cm Revanth Reddy: కేటీఆర్.. చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కు..!

Cm Revanth Reddy: కేటీఆర్.. చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కు..!

నిర్మల్ , మన సాక్షి :

కేటీఆర్ చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కువ టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు కానట్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలు అమలు కావడం లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసింది. దాంతో రేవంత్ రెడ్డి కేటీఆర్ పై మండిపడ్డారు. ఆదిలాబాద్ దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఆదిలాబాద్ లో మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రైతుల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీ లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీ హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఆయన కోరారు.

ALSO READ : 

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

KTR : నువ్వు కట్టుకుంటావా చీర.. లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా..? 

మరిన్ని వార్తలు