Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsUncategorizedఆంధ్రప్రదేశ్రాజకీయం

Ap News : రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న నరేంద్ర మోడీ..!

Ap News : రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న నరేంద్ర మోడీ..!

Mana Sakshi : 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది.

తెలుగుదేశం పార్టీ 135 స్థానాలను, జనసేన 21, స్థానాలను బిజెపి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆఖండ విజయం సాధించిన ఎన్ డి ఏ కూటమి మంత్రివర్గం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరవుతారని టిడిపి బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. రేపు ఉదయం 10:40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు మోడీ చేరుకుని 10.55 గంటలకు ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు మోడీ వెళతారు. 11 గంటల నుంచి 12:30 గంటల వరకు వేదికపైనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. అనంతరం ఒడిశాకు వెళ్ళనున్నారు.

ALSO READ : 

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

మరిన్ని వార్తలు