BREAKING: కన్న కూతురిపై కన్నేసిన కామంధుడు.. హత్య చేసి తప్పించుకుని ప్రయత్నం, కేసు చేదించిన పోలీసులు..!
BREAKING: కన్న కూతురిపై కన్నేసిన కామంధుడు.. హత్య చేసి తప్పించుకుని ప్రయత్నం, కేసు చేదించిన పోలీసులు..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
మద్యానికి బానిసై.. నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. వావి వరసలు మరిచి తన వాంఛను తీర్చమని కోరటమే కాకుండా… కాదన్నందుకు ఏకంగా సొంత కూతురినే అతి కిరాతకంగా హత్య చేశాడు తండ్రి. ఆపై ఏమీ ఎరగనట్లు తన కూతురు కనిపించకుండా పోయిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ దుర్గా రామలింగ ప్రసాద్, ఎస్ఐ రాజులతో కలిసి మియాపూర్ ఏసీపీ నర్సింహారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మియాపూర్ నడిగడ్డ తండాకు చెందిన బానోతు నరేష్(35) తన కూతురు (13) అదృశ్యం అయినట్లు ఈ నెల 7వ తేదీన మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. 13వ తేదీన నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆనవాళ్ల ప్రకారం తప్పిపోయిన బాలిక(13)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయి విచారణతో పాటు సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
బాలిక తండ్రి నరేష్ తన కూతురును వంట చెరుకు తీసుకువద్దామని చెప్పి తన బైక్‌పై నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. అక్కడ తన కామ వాంఛను కూతురుకు చెప్పటంతో వ్యతిరేకించి బిగ్గరగా అరిచింది. తన దురాలోచన గురించి కూతురు అందరికీ చెబుతుందన్న భయంతో జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు. ముక్కులో నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలో పడిన అనంతరం పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో బాలిక అక్కడి కక్కడే మృతి చెందింది.
అనంతరం తన ద్విచక్ర వాహనంపై కొంత దూరం వెళ్లిన నిందితుడు నరేష్ కూతురు మరణించిన విషయాన్ని ధృవీకరించుకునేందుకు మరోమారు ఘటనా స్థలానికి వెళ్లి నిర్ధారించుకున్నాడు. ఇక ఇంటికి వెళ్లిన నిందితుడు నరేష్ కూతురు కనిపించటం లేదంటూ భార్యకు చెప్పి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రే నిందితుడని తేల్చారు. ఈ మేరకు నిందితుడు నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.
ALSO READ :
Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!
Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!
Hyderabad : ఐటి కారిడార్ లో బైక్ రేసింగ్.. బైకులు వదిలి పారిపోయిన యువకులు ఎందుకో..?









