Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KCR : తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా..? దొంగలతో కలిసేటోళ్ల గురించి బాదలేదు..!

KCR : తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా..? దొంగలతో కలిసేటోళ్ల గురించి బాదలేదు..!

హైదరాబాద్, మన సాక్షి ;

పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా?
అని కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

కాగా.. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై చర్చించారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేదని అన్నారు.

ALSO READ: Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యేలు డా. సంజయ్, కౌశిక్ రెడ్డి,. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

Swarnagiri : ఏ నోట విన్నా స్వర్ణగిరి దేవాలయమే.. ప్రత్యేకతలు ఏంటో మీరూ చూడండి..!

SLBC : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సొరంగం శ్రీశైలం.. నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..! 

మరిన్ని వార్తలు