Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Cm Revanth Reddy : బీఆర్ఎస్ కు కోలుకోలేదు దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..!

Cm Revanth Reddy : బీఆర్ఎస్ కు కోలుకోలేదు దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..!

హైదరాబాద్, మన సాక్షి :

బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే ఎమ్మెల్యే లు కారు దిగి కాంగ్రెస్ లో చేరుతుండగా ఎమ్మెల్సీలు కూడా భారీ షాక్ ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండే విటల్ , భాను ప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం, బసవరాజు సారయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరంతా గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాగా ఆయన ఢిల్లీ నుంచి వచ్చే విమానం ఆలస్యం కావడంతో అర్ధరాత్రి దాటింది. అప్పటికే రేవంత్ నివాసంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. దాంతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం 12 కు చేరింది. గతంలో ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి ఉండగా కొత్తగా బీఆర్ఎస్ నుంచి ఆరుగురు చేరారు.

మొత్తం శాసనమండలి 40 స్థానాలకు గాని రెండు ఖాళీలు ఉన్నాయి. ఇద్దరు బిజెపి ఎమ్మెల్సీ లు ఉన్నారు. ఇద్దరు గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పక్షం ఉండాల్సి ఉంది. దాంతో కాంగ్రెస్ బలం 14 చేరింది. మరో నలుగురు, ఐదుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరితే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కి ఉండే అవకాశం ఉంది.

ALSO READ : 

BREAKING : ఆ 12 అంశాలపై ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క భేటీ..!

BREAKING : హోటల్లు బేకరీలపై మున్సిపల్ కమిషనర్ దాడులు.. బెంగళూరు అయ్యాంగార్ బేకరీ కి జరిమానా..!

మరిన్ని వార్తలు