Miryalaguda : 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!
Miryalaguda : 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!
మిర్యాలగూడ , మన సాక్షి :
నిల్వ ఉంచిన పిడిఎఫ్ పట్టుకున్న సంఘటన మిర్యాలగూడ మండలంలోని టీక్యా తండ లో ఆదివారం జరిగింది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. టీక్యా తండలో పిడిఎఫ్ బియ్యం ఉన్నట్లు 100 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయగా వెళ్లి పరిశీలించగా పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు.
వెంకటాద్రిపాలెం కేశవ నగర్ కు చెందిన ధీరావత్ సోని అను వ్యక్తి తండాలో కిరాయికి తీసుకున్న వరండాలో పట్టాల కింద బస్తాలతో దాచించిన 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు కొని వరండాలో అతను నిల్వ ఉంచినట్లు తెలిసిందని తెలిపారు. నిలువ ఉంచిన పీడి ఎస్ బియ్యం పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ALSO READ :
Suryapet : బాలెంల గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో బీరు బాటిల్స్.. సంఘటనపై త్రి సభ్య కమిటీ..!









