Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

BREAKING : మియాపూర్ జనప్రియా అపార్ట్మెంట్ పైనుండి దూకి యువతి ఆత్మహత్య..!

BREAKING : మియాపూర్ జనప్రియా అపార్ట్మెంట్ పైనుండి దూకి యువతి ఆత్మహత్య..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ 6వ బ్లాక్ పై నుండి దూకి ఓయువతి ఆత్మహత్య కు పాల్పడింది..ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ప్రాథమిక సమాచారం మేరకు జనప్రియ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండే బోరుగడ్డ శ్రుతి (35) ఎంఫార్మసీ చదువుతుంది. అయితే ఆమెకు ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా కుదరక పోవడంతో శృతి డిప్రెషన్ లోకి వెళ్లిన క్రమంలో ఉదయం 11 గంటలకు అపార్ట్మెంట్ 6 వ బ్లాక్ 4 వ అంతస్తు పై నుంచి దూకింది.

స్థానికులు గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం యువతిని మియాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర రక్త స్రవంతో ఉన్న యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!

మరిన్ని వార్తలు