ఆషాడం పంచాయతీ.. నేలపై కూర్చున్న మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి..!
ఆషాడం పంచాయతీ.. నేలపై కూర్చున్న మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఆషాడ మాసంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాత్రం ఆషాడం బోనాల పండుగ పంచాయతీ జరిగింది. వివరాల ప్రకారం.. మహేశ్వరం నియోజకవర్గం లోని ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
అయితే అధికారులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని వేదికపైకి పిలవలేదు. అనుచరులతో వేదిక పైకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుడిని వేదిక మీదికి పిలిచి చెక్కులు పంపిణీ చేశారని సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. దీంతో అధికారులకు తీరును నిరసిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం తెలిపారు.
లబ్ధిదారులను మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలపై కూర్చుని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అప్పటికి దేవాదాయ శాఖ అధికారులు మాత్రం బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేశారు.
ALSO READ :
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!
Cm RevanthReddy : పరీక్షలు వాయిదా ఎందుకు వేయమంటున్నారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)
ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!









