Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking Newsపండుగలు

Muharram : మొహరం.. విశిష్టత, నేడు దేశవ్యాప్తంగా మొహరం వేడుకలు.!

Muharram : మొహరం.. విశిష్టత, నేడు దేశవ్యాప్తంగా మొహరం వేడుకలు.!

కంగ్టి , మన సాక్షి:

మొహరం పండుగ ఇస్లామీయ నంవత్సరం ముహర్రం లేదా మొహర్రంతోనే ప్రారంభమవుతుంది. ఏడాదిలోని మొదటీ నెల ముహర్రం కాగా, జిల్‌ హజ్జ చివరి మాసం. ముహర్రం పేరు వినగానే జ్ఞాపకం వచ్చే మొదటి చారిత్రక సంఘటన… కర్బలా మైదానంలో జరిగిన అపూర్వ సంగ్రామం. ఆ సంఘటన అద్వితీయమైనది. ఖిలాఫత్‌ వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి ఇమామ్‌ హుసేన్‌ చేసిన మహత్తరమైన త్యాగానికి అది చిహ్నం.

రాజకీయపరంగా ఇస్లాం ధర్మంలో ఖలీఫా వ్యవస్థ ఉంది, కానీ రాచరిక వ్యవస్థ లేదు. రాజు కుమారుడు రాజు కావడం, మంత్రి కుమారుడు మంత్రి కావడం అనే అనువంశిక వ్యవస్థ అసలే లేదు. ఖలీఫా ఎన్నిక మూడు నూత్రాల ప్రకారం… ప్రజాస్వామ్య పద్దతిలో జరుగుతుంది. మొదటిది… మహా ప్రవక్త పాటించిన విధంగా ఎవరినీ ఖలీఫాగా నియమించకూడదు. ప్రజలే ఎన్నుకోవాలి.

రెండవది… మొదటి ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ చేసినట్టు… తమతో ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తిని ఖలీఫాగా సూచించవచ్చు. మూడోది… రెండో ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ మాదిరిగా ఖలీఫా ఎన్నికను మేధావులతో కూడిన సలహా సంఘానికి అప్పగించవచ్చు. వారు తమ నుంచి ఒకరిని ఖలీఫాగా ఎన్నుకుంటారు. కానీ హజత్‌ మావియా తన కుమారుడైన యజీద్‌కు యువరాజు పట్టాభిషేకం చేని పై మూడు ధర్మ  సూత్రాలనూ కాలరాశారు. అప్పటి నుంచే రాచరిక వ్యవస్థ మొదలయింది.

మహా ప్రవక్త మహమ్మద్‌ దివంగతులైన తరువాత. హజ్రత్‌ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, నాలుగో ఖలీఫాగా హజ్రత్‌ అలీ ఎన్నికయ్యారు. ఆ తరువాత హజ్రత్‌ మావియా ఖలీఫా అయ్యారు. ఆరేబియా దేశాన్ని పంతొమ్మిది సంవత్సరాలు పాలించారు. కానీ పుత్ర  ప్రేమతో… అయోగ్యుడైన దురలవాట్లకు లోనైన తన కుమారుడు యజీద్‌ను యువరాజుగా నియమించారు.

యజీద్‌ ఎన్నిక ఇస్తాం ధర్శసూత్రాలకు పూర్తిగా వ్యతిరేకం. ఆది అనువంశిక వ్యవస్థే తప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఎంతమాత్రం కాదు. ఆ విధంగా ఇమామ్ హుస్సేన్ ధర్మ రక్షణ కోసం చివరి వరకు పోరాడి అమరుడయ్యారు.. కర్బలా యుద్ధం ఇమామ్ హుస్సేన్ త్యాగం చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఘట్టలు అని మత పెద్దలు అన్నారు.

మొహర్రం మానంలో సంభవించిన చారిత్రకమైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మాసంలోని పదవ రోజున ప్రథమ దైవ ప్రవక్త స్వర్గంలో ప్రవేశించారు. దైవ ప్రవక్త హజ్రత్‌నూ, ఆయన అనుచరులను అల్లాహ్‌ నావలో రక్షించి, దుష్టులను శిక్షించినది ఆరోజే.

అదే విధంగా దుర్మార్గుడైన రాజు వల్ల అగ్నిగుండంలో పడీన ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీంను కాపాడిందీ ఫిరౌన్‌ రాజునూ, అతని లక్షలాది సైన్యాన్ని సముద్రంలో ముంచి… దైవప్రవక్త ముసానూ, ఆయన అనుచరుల్నీ రక్షించినది కూడా ఈ రోజే. అలాగే అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ మనుమడైన ఇమామ్‌ హుసేన్‌ కూడా ఈ మాసంలోని పదో రోజున ప్రాణ త్యాగం చేశారు. అందుకే ఈ మాసానికి ఇంత ప్రాధాన్యత, ఎనలేని గౌరవం ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : 

BIG BREAKING : రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, తొలి విడత రుణమాఫీ ఈనెల 18నే.. రేషన్ కార్డు పై కూడా స్పష్టత..!

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!

మరిన్ని వార్తలు