Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

సద్దుల చెరువు అలుగు ఆక్రమణ.. అందుకే ఇండ్లలోకి వర్షపు నీరు..! 

సద్దుల చెరువు అలుగు ఆక్రమణ.. అందుకే ఇండ్లలోకి వర్షపు నీరు..! 

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో చాలాచోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయని వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఖాళీ స్థలాల యజమానులు ముందుకు వచ్చి తమ భూములను శుభ్రం చేసుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని మాట్లాడారు.

సద్దుల చెరువు నుంచి వచ్చే అలుగును కొందరు ఆక్రమించారని ప్రస్తుతం వారిని ఏమి అనే పరిస్థితి లేదని అన్నారు. అలుగు ఆక్రమించడంతో వరద నీరు ఇండ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధిక వరద వచ్చినప్పుడు తమ ఇండ్లన్నీ మునుగుతున్నాయని స్థానికులు చెప్పడంతో పరిశీలించడం జరిగిందని ఈ విషయమై ఏం చేస్తే బాగుంటుందోనని అధికారులతో మాట్లాడి దాదాపు 450 మీటర్లు బాక్స్ డ్రైనేజీ కడితే అధిక వరద నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందన్నారు.

ALSO READ : దారి లేకపోవడంతో రెండేళ్లుగా బీళ్లుగా మారిన గిరిజన రైతుల భూములు.. పరిశీలించిన ఆర్డిఓ..!

బాక్స్ డ్రైనేజీ పనులు జరిపెందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే వెంచర్లు చేసిన వాళ్లు నాలాను పక్కకు తిప్పడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. సూర్యాపేటలో పరిశీలిస్తే చాలా చోట్ల ఖాళీ స్థలాలు దర్శనమిస్తున్నాయని కంప చెట్లు మొలిచి నీరు నిలిచి దోమలు పెరగడంతో ప్రజలు నానా ఆవస్తలు పడుతున్నారని అన్నారు.
సూర్యాపేట పట్టణ ప్రజలు ఖాళీ స్థలాలకు వియల్టి కట్టుకుంటే మీయొక్క భూమికి హక్కు వస్తుందని అలాగే ఖాళీ స్థలాల్లో చెట్లు తొలగించి శుభ్రం చేసుకుంటే దోమల నుంచి కూడా నివారణ చేసుకోవచ్చన్నారు.

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ను అడగగా ఖాళీ స్థలాలు ఎవరి పేరు పైన ఉన్నాయో సమాచారం లేదని చెప్పారని ఖాళీ స్థలాల యజమానులు వెంటనే మీ స్థలాలను శుభ్రం చేసుకుంటే బాగుంటుందన్నారు.
అధికారులకు కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ఖాళీ స్థలాలు ఉన్నాయి తప్ప యజమానులు, హద్దులు తమకు తెలియదని చెప్పడంతో నోటీసులు ఇచ్చి చేస్తే వారి భూములు కూడా సురక్షితంగా ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరతో పికాస్ట్ కూడా వచ్చాయని కాబట్టి మీ యొక్క భూములకు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని శుభ్రం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని ఖాళీ స్థలాల యజమానులు తక్షణమే స్పందించి తమ ప్లాట్లను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి : 

BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!

Ration Rice : మిర్యాలగూడలో రేషన్ బియ్యం పట్టివేత..! 

మరిన్ని వార్తలు