Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsక్రైంరంగారెడ్డి

ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి..!

ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఏలికట్ట గ్రామ శివారులో అక్రమ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులుల నిర్వహించిన తనిఖీల్లో 500 గ్రాముల గంజాయిని పట్టుబడింది.

గంజాయిని స్వాధీనం చేసుకొని, అమ్మకాలు సాగించే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధూల్పేట్ నుంచి తరుణ్ జోష్ జైన్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి ఫరూఖ్ నగర్ మండలంలోని ఏలికట్ట గ్రామంలో గంజాయి అమ్మకాలు సాగించే ప్రయత్నాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.

ఎక్సైజ్ సీఐ పి. శేఖర్ ఆధ్వర్యంలో, ఎస్సైలు శ్రీనునాయక్, సునీత తదితర పోలీసు సిబ్బంది తో కలిసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి 500 గ్రాముల గంజాయిని పట్టుకున్న షాద్ నగర్ ఎక్సైజ్ సిబ్బందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ ధశరథ్, సరూర్నగర్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్. ఉజ్వల రెడ్డి అభినందించారు.

ఇవి కూడా చదవండి : 

ఈ పంతులు మాకోద్దు..! ఆయన వస్తే.. పక్క స్కూల్ కు పంపిస్తాం.. MEO వద్ద విద్యార్ధుల తల్లిదండ్రులు మొర..!

నడుము లోతు నీటిలోకి దిగి షర్మిల వినూతన నిరసన..!

NALGONDA : మున్సిపాలిటీలలో 26 నుంచి ఇంటింటి సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..! 

మరిన్ని వార్తలు