క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
మిర్యాలగూడ : అక్రమంగా ఆటోలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!
మిర్యాలగూడ : అక్రమంగా ఆటోలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అక్రమంగా ఆటోలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యంను పోలీసులు పట్టుకున్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం వెంకటాద్రిపాలెం లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆటోలో ఐదు క్వింటాల పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు.
దాంతో ఆటో డ్రైవర్ ధనావత్ నాగుపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసి స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై ఆటో డ్రైవర్ ను విచారించగా తాను ఏడు కోట్ల తండా సమీపంలోని వివిధ గ్రామాలలో తెల్ల రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు తెలిపాడని ఎస్ఐ పేర్కొన్నారు.









