నల్గొండ జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. కొరడా జులిపించిన పోలీసులు..!
నల్గొండ జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. కొరడా జులిపించిన పోలీసులు..!
నల్లగొండ, మన సాక్షి :
బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట మద్యం సేవించి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కొరడ గెలిపించారు. వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహిం అన్చేది లేదు అని.బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై నిరంతర నిఘా పెట్టామని రాత్రి వేళల్లో రోడ్లపై హల్ చల్ చేస్తే చర్యలు తప్పవు అని నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి నల్లగొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మద్యపానం సేవించడంతో పాటు రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాలతో రోడ్లపై హల్ చల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఇకపై ప్రతినిత్యం పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ మద్యపానం చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు.
ఎక్కడైనా ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి వివరాలను డయల్ 100 ద్వారా సమాచారం ఇస్తే వెంటనే అక్కడకు చేరుకొని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియంత్రణలో పోలీసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
శనివారం రాత్రి ఇద్దరు సిఐలు, పలువురు పోలీసు సిబ్బందితో 11 బృందాలుగా పట్టణంలో బహిరంగ మద్యపానం సేవిస్తున్న 50 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా రాత్రి సమయాలలో ఇబ్బందులకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయడంతో పాటు నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై రోడ్లపై హల్ చల్ చేస్తూ వారి వద్ద నుండి 54 బైక్లను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సిఐ డానియల్ ఎస్సైలు సందీప్ రెడ్డి,రాజు, శ్రీను పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!
Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!










