Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

DEVARAKONDA : ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి..!

DEVARAKONDA : ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి..!

నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

దేవరకొండ, మనసాక్షి :

దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం ఎస్ఎల్బీసీ,డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి అన్నారు. దేవరకొండ మండల నిర్మాణ కౌన్సిల్ సమావేశం కామ్రేడ్ పల్లా పర్వత్ రెడ్డి భవన్ లో కామ్రేడ్ దేపా సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం కమిషన్ ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద శ్రద్దతో కాలయాపన చేసి నల్లగొండ జిల్లా ప్రాజెక్టు లను గాలికొదిలేసిందని అన్నారు.

నక్కలగండి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో స్వర్గీయ వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో సొరంగమార్గం టన్నెల్ పనులు పూర్తి దశలో ఉండగా బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 10 కిలోమీటర్లు పూర్తి చేయడానికి శ్రద్ద చూపలేదని అన్నారు.ఎస్ఎల్బిసీ, నక్కల గండి ప్రాజెక్టు లను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం శుభ పరిణామమని ప్రజా, రైతు ఆకాంక్షల మేరకు ప్రారంభించిన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ ఆయన కోరారు.

డిండి లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని డిండి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీటినందించాలన, .రైతు భరోసా విడుదల చేసి వర్షాకాలం పంటలకు రైతులను ఆదుకోవాలని, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచిన వెంటనే అమలు చేయాలని, రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇండ్లు ఇళ్లస్థలాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని రైతు బీమా అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలు చేసి తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయనాయక్,ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు పార్లపల్లి కేశవ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, మండల కార్యవర్గ సభ్యులు జూలూరి వెంకట్రాములు, పల్లా రంగారెడ్డి, కిన్నెర యాదయ్య, గంగిడి రాంరెడ్డి, ఎండి మైనొద్దీన్ తదితరులు ఉన్నారు.

ALSO READ : 

Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update

BREAKING NALGONDA : భూ తగాదాలలో కర్రలు,  రాడ్లతో పరస్పర దాడులు.. 14 మందిపై కేసు..! 

Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!

మరిన్ని వార్తలు