ధరణి దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి.. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్..!
ధరణి దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి.. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
ధరణి దరఖాస్తులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసిల్దార్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ఆమె రెవిన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ మధుమోహన్ తో కలిసి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాలలో పెండింగ్ లో ఉన్న పాత, కొత్త దరఖాస్తులు మండలాల వారిగా ఎన్ని ఉన్నాయని ? తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. గత శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఒక్కో మండలంలో ఎన్ని పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేశారని తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికప్పుడు దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. పాత దరఖాస్తులకు పరిష్కరిస్తూనే కొత్త వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ రెండు రోజుల్లో ధరణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని చెప్పారు. సమీక్షలో జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!









