MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!
MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతుల జీవితాలలో వెలుగు నింపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం సైట్ ను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
ముందుగా చిట్యాల గ్రామం , దున్నపోతుల గండి లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ఇంటేక్ వెల్ ను, కృష్ణా నది నుండి దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ఇంటెక్ వెల్ కు వచ్చే హలియా వాగును మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు .
అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం 2 పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించనున్నామని ,మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని 5 లిఫ్టులకు కావలసిన నిధులతోపాటు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ప్రధాన కాలువలతో పాటు, మైనర్ కాలువలలో పూడికతీత, చెట్ల తొలగింపు వంటి వాటికి 24 గంటల్లో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం 5 లిఫ్ట్ ఇరిగేషన్లకు 490 కోట్ల రూపాయలు అవసరం కాగా ,వాటిని తక్షణమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈ 5 లిఫ్ట్ లను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను, ప్రాజెక్టు సీఈని ఆయన ఆదేశించారు. లిఫ్ట్ ఇరిగేషన్ల కు ఎలాంటి నిధుల కొరతలేదని, వేగవంతంగా పనులు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవపురం లిఫ్ట్ ల ద్వారా లబ్ధి పొందనున్న గ్రామాల గురించి వివరించారు.
అంతేకాక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరిన వాచ్యతాండ రెండవ లిఫ్టును మంజూరు చేస్తామని, అలాగే మూడు చెక్ డ్యాములను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల జీవితాలలో వెలుగు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు బాగుంటే అందరు బాగుంటారని అన్నారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజవర్గం పరిధిలో చేపట్టిన 5 లీఫ్ ఇరిగేషన్లకు సంబంధించి భూసేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు .
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మిర్యాలగూడ నియోజకవర్గం లోని ఎత్తిపోతల పథకాల పూర్తికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెంతనే కృష్ణా నది నీరు ఉన్నప్పటికీ, ఎలాంటి ఉపయోగం లేకుండా కిందికి తరలిపోయాయని అన్నారు.
తనకు ఈరోజే తెలంగాణ వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవాపురం ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని, ఇందుకు సంతోషంగా ఉందని, సంవత్సరంలోపే ఈ ఎత్తిపోతల పథకాలాన్ని పూర్తి చేయాలని ఆయన మంత్రకి విజ్ఞప్తి చేశారు.
అలాగే నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువ నుండి డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి సైడ్ కెనాల్స్ పూడికతో పూడుకుపోయి ఉన్నాయని, కంపచెట్లు పెరిగిపోవడం, అక్కడక్కడ బ్రిడ్జిలు కూలిపోయి ఉన్నాయని వాటిని తక్షణమే బాగు చేయాలని ఆయన కోరారు. అంతేకాక వాచ్యతాండ -2 ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని, 3 చెక్ డ్యాములను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ , ఎత్తిపోతల పథకాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు ,అసిస్టెంట్ ఇంజనీర్లు, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, అడవిదేవులపల్లి తహసిల్దార్ తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
ALSO READ :
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
Miryalaguda : ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.. జిల్లా కలెక్టర్
Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!
కూలిపోయిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పరిశీలించిన మంత్రులు.. సంఘటన దురదృష్టకరం..!











