Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

NARAYANPET : పోలీస్ అధికారులకు నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ కిట్స్ అంద జేత..!

NARAYANPET : పోలీస్ అధికారులకు నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ కిట్స్ అంద జేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ జిల్లా పోలీస్ అధికారులకు నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

మాదకద్రవ్యాలు, డ్రగ్స్ పై యువతకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. యువత చెడు అలవాటులకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ వైపు ముందుకు సాగాలన్నారు. సమాజంలో ప్రభుత్వం నిషేధించిన కొన్ని రకాల మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడంలో యువత పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇప్పటినుండి జిల్లాలో మాదాకద్రవ్యాలు సేవిస్తే డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని టేస్టుల్లో పాజిటివ్ వస్తే అట్టి వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఎన్ లింగయ్య, సిఐ లు శివశంకర్, చంద్ర శేఖర్, రాజేందర్ రెడ్డి, ఎస్సై లు బాల వెంకటరమణ, సునిత తది తరులు పాల్గొన్నారు.

ALSO READ : 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!

District collector : మిల్లర్లు గడువులోగా CMR డెలివరీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!

Nelakondapally : పాపం.. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆ చిన్నారులకు తెలియదు..!

PDS : రాత్రి వేళ తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!

మరిన్ని వార్తలు