Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Sand Booking : నేటి నుంచి ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్.. మన ఇసుక వాహన ద్వారా 48 గంటల్లో సరఫరా..!

Sand Booking : నేటి నుంచి ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్.. మన ఇసుక వాహన ద్వారా 48 గంటల్లో సరఫరా..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరాకు ఆన్ లైన్ బుకింగ్ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవు తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.

నీరుకుల్ల, గట్టెపల్లి ఇసుక రీచ్ ల నుండి సాండ్ టాక్సీ (మన ఇసుక వాహనం) విధానాన్ని ప్రారంభిస్తున్నామని, మన జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి , ఎలిగేడు, ఓదెల మండలాల ప్రజలకు సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి , ఎలిగేడు, ఓదెల మండలాల ప్రజలు ఇసుక సరఫరా కోసం ఆగస్టు 17 నుంచి ఆన్ లైన్ https://tgmiv.cgg.gov.in వెబ్ సైట్ లో బుకింగ్ చేసుకోవాలని, ఇసుక బుక్ చేసిన 48 గంటల లోగా డెలీవరీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

టన్ ఇసుక సరఫరా కోసం ఓదెల మండలానికి 1900 రూపాయలు, కాల్వ శ్రీరాంపూర్ మండలానికి 1900 రూపాయలు, పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి 1900 రూపాయలు, పెద్దపల్లి మండలం సబితం గ్రామానికి 2100 రూపాయలు,

జూలపల్లి మండలానికి 2100 రూపాయలు, ధర్మారం మండలానికి 2100 రూపాయలు, పెద్దపల్లి మండలానికి 1750 రూపాయలు,ఎలిగేడు మండలానికి 1750 రూపాయలు, సుల్తానాబాద్ మండలానికి 1100 రూపాయలకు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. మన ఇసుక వాహనం వెబ్ సైట్ లో బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం నుంచి ఇసుక డెలివరీ ప్రారంభిస్తామని తెలిపారు.

మన ఇసుక వాహనం కాల్ సెంటర్ ను సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఏర్పాటు చేశామని, ఇసుక బుకింగ్ లో ఇబ్బందులు ఎదురైతే కాల్ సెంటర్ నెంబర్ 08728-223310, 08728-223318 ఫోన్ నెంబర్ లో నందు సంప్రదించాలని , ఇతర ముఖ్య సమాచారం కోసం ఇంచార్జి అధికారి కే.శ్రీనివాస్ 9515977538 నంబర్ నందు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

ALSO READ : 

Job Mela : రేపు మెగా జాబ్ మేళా, సద్వినియోగం చేసుకోండి.. జిల్లా ఎస్పీ..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్..!

మరిన్ని వార్తలు