TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!

HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!

హైదరాబాద్, మన సాక్షి :

ఇప్పుడు హైదరాబాద్ వాసులకు హైడ్రా అంటేనే హడల్ ఎత్తుతోంది. అక్రమ నిర్మాణ నిర్మాణాలను కూల్చివేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూముల్లో, చెరువుల ఆక్రమణ చేసి నిర్మాణాలు చేసుకోవడం వల్ల వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో నగరం అంతా అల్లకల్లోలం అవుతుంది.

దాంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైడ్రా గండిపేట ఎఫ్ టి ఎల్ లోని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తాజాగా సినిమా హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూడా కూల్చివేశారు. శివారు ప్రాంతాల్లోని ఎఫ్ టి ఎల్, బఫర్ జోనల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం వల్ల అనేకమంది పెద్దల గెస్ట్ హౌస్ లో కూలిపోతున్నాయి.

హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది అందుకు గాను హైదరాబాదులోని 134 చెరువుల్లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో 8718 నిర్మాణాలు, బఫర్ జోన్ పరిధిలో 5343 నిర్మాణాలు జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే హైడ్రా వీటన్నిటి గుర్తించి పూర్తిస్థాయిలో కూల్చివేస్తుందా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

LATEST UPDATE : 

BIG BREAKING : భారీ బందోబస్తు మధ్య సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు