Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!

Nalgonda : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!

నల్లగొండ, మన సాక్షి :

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడ ని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన సంఘటన నల్లగొండ పట్టణంలోని ముసంపల్లి రోడ్డు లోని హైటెక్ కాలనీలో చోటుచేసుకుంది.

టూటౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం వడ్డెర కులానికి చెందిన ఓర్సు వెంకన్న తన భార్య మైసమ్మ తో కలిసి సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామం నుండి బతుకుదెరువు కోసం నల్లగొండకు వచ్చి హైటెక్ కాలనీలో నివాసము ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవించేవారని తెలిపారు.

గత కొంతకాలంగా నల్గొండ మండలం వెలుగు పెళ్లికి చెందిన ఖండే బిక్షం అను అతనితో మైసమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఇది తెలుసుకున్న భర్త ఓర్చు వెంకన్న భార్యను మందలించగా గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు.

దీంతో ఈనెల 28న రాత్రి సమయంలో మద్యం సేవించి ఉన్న ఓర్సు వెంకన్నని అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కోపంతో ఖండేభిక్ష మ్ ప్రోత్బలంతో భర్త వెంకన్న ను బలంగా రాయిపై నెట్టి ఆపై అతనిపై కూర్చొని గొంతు నిలిమి హత్య చేసినట్లు సీఐ తెలిపారు.

తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ చుట్టుపక్కల వారికి సహజంగా చనిపోయాడని నమ్మ బలికిన్ది అని తెలిపారు. ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసినట్లు సిఐ తెలిపారు.

LATEST UPDATE : 

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు