District collector : గడువులోగా కష్టం మిల్లింగ్ డెలివరీ చేయకుంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!
District collector : గడువులోగా కష్టం మిల్లింగ్ డెలివరీ చేయకుంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సెప్టెంబర్ 30 లోపు గత వానాకాలం, యాసంగికి సంబంధించిన సిఎంఆర్ డెలివరీని రైస్ మిల్లర్లు పూర్తిచేసి తీరాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం అయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎం ఆర్ పై సమావేశం నిర్వహించారు.
మిల్లర్లు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యం పూర్తవుతుందని, అందువల్ల సీఎంఆర్ డెలివరీ విషయంలో మిల్లర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో ధాన్యం దుర్వినియోగం అయ్యె పరిస్థితి తీసుకురావద్దని, ప్రభుత్వం నుండి తీసుకున్న ధాన్యం మొత్తం తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా మిల్లర్లు కృషి చేయాలని , ఎవరైనా ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలని , సీఎంఆర్ విషయాన్ని మిల్లర్లు ముఖ్యమైన అంశంగా తీసుకోవాలని, జిల్లాకు ఎట్టి పరిస్థితులలో చెడ్డ పేరు తీసుకురావద్దని ఆయన కోరారు.
అలాగే 2022- 23 సంవత్సరానికి సంబంధించిన వేలం ధాన్యాన్ని సైతం టెండర్లు పొందిన మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని, ఈ విషయమై వచ్చే బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
రానున్న సీజన్లో ధాన్యం సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సలహాలు ,సూచనలను జిల్లా కలెక్టర్ కోరగా, సన్నధాన్యం 67 నుండి 60 శాతానికి తగ్గించాలని ,15 రోజుల గడువును పెంచాలని, కొత్త గన్ని బ్యాగులు ఇవ్వాలని , ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం రకాల వారిగా వేరువేరుగా కొనుగోలు చేయాలని, వింగ్స్ సాఫ్ట్వేర్ ను సరళీకృతం చేయాలని, మిల్లుల నుండి ధాన్యాన్ని వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వారి సమస్యలన్నింటిని ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ సీజన్ ధాన్యాన్ని అదే సీజన్లో సీఎంఆర్ డెలివరీ చేయాలని ఆదేశించడం జరిగిందని, గత వానాకాలం, యాసంగికి సంబంధించిన సిఎంఆర్ సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలన్నారు. వానకాలానికి సంబంధించి 2 లక్షల పదహారు వేల మెట్రిక్ టన్నులకు గాను, 1,62,000 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ను మిల్లర్లు చెల్లించారని ,ఇంకా 54,000 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సి ఉందని, యాసంగికి సంబంధించి 2 లక్షల ఇరవై ఒక్కవేల మెట్రిక్ టన్నులకు గాను, లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు డెలివరీ చేశారని, ఈ రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ను వేగవంతం చేయాలని కోరారు.
సీఎంఆర్ డెలివరీ విషయంలో పౌరసరఫరాలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిరంతరం మిల్లులను సందర్శిస్తున్నారని, తాము సైతం మిల్లర్లతో సమావేశం నిర్వహించి సిఎంఆర్ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కంట్రోల్ ఏజిఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎఫ్ సి ఐ మేనేజర్ శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, నల్గొండ సెక్రటరీ భద్రాద్రి, మిర్యాలగూడ సెక్రటరీ బాబి, పార సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
LATEST UPDATE :
ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!
Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!
Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!
Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!










