కంగ్టిలో కుక్క దాడి.. పలువురికి గాయాలు..!
కంగ్టిలో కుక్క దాడి.. పలువురికి గాయాలు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కుక్క కరిచిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కంతి సుదర్శన్ ఆదివారం ఉదయం బైక్ ఫై వెళుతుండగా స్థానిక పెట్రోల్ పంపు వద్ద కుక్క వెంబడించి కరిచి గాయపరిచింది.
దాంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్సలు చేశారు. అదేవిధంగా మరో ఇద్దరిపై కూడా దాడి చేసిందని, కంగ్టి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా కుక్కలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
LATEST UPDATE :
Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!









