Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయం

తెలుగు ప్రజలకు వెల్లుల్లి ఘాటు..!

తెలుగు ప్రజలకు వెల్లుల్లి ఘాటు..!

రామసముద్రం, మనసాక్షి :

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెల్లుల్లి ఘాటు తగిలింది. ఇంతకాలం టమాటా ధరలు చుక్కల నంటిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉల్లిగడ్డతో పాటు వెల్లుల్లి ఘాటు తగిలింది.

వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతూ కిలో 500 పలుకుటుండడంతో వినియోగదారుల కంటకన్నీరు వస్తోంది.. ప్రతి కూరలోను వెల్లుల్లి, ఉల్లిపాయలు లేనిదే వంట వీలుకాదు, రుచిరాదు. గత నెలరోజులుగా కిలో నూరు రూపాయలు ఉన్న వెల్లుల్లి ధరలు అంతకంతకు పెరిగి ఐదు వందలకు చేరుకున్నాయి.

ధరలు అకాశాన్ని అటడంతో సామాన్యప్రజలు దిగులు చెందుతున్నారు. మండలకేంద్రం లోని దినసరి మార్కెట్ లో బుధవారం కిలో వెల్లుల్లి కిలో 450నుండి 500 వందలు పలికింది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో కిలో కొనాలనుకున్న వినియోగ దారులు 250గ్రాముల వెల్లుల్లి 125 రూపాయలకు కొని వెనుతిరుగుతున్నారు.

రెండు నెలలుక్రితం టమోటా ధరలు దడపుట్టిoచగా నేడు, వెల్లుల్లి ధరలు వినియోగదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రాబోయే పండుగల వేల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారస్తులు అంటున్నారు. ఉల్లిగడ్డ ధరలు 60 రూపాయలుగా విక్రయిస్తున్నారు. ఆధారాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.

LATEST UPDATE : 

TG News : ఉద్యోగుల ఔదార్యం.. వరద బాధితులకు భారీ విరాళం..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

మరిన్ని వార్తలు