Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణహైదరాబాద్

UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!

UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా యూపీఐ పేమెంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన 13 మంది నిందితుల నుంచి రూ. 1.72 లక్షల నగదుతో పాటు 50 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ సిసిఎస్, కె బి హెచ్ బి, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామని సైబరాబాద్ డీసీపీ నరసింహ మీడియా సమావేశంలో తెలిపారు. నిందితులంతా బజాజ్‌ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లలో వివిధ వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు.

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సైబరాబాద్‌ డీసీపీ నరసింహ తెలిపారు.ఈ ముఠా చెల్లింపులు చేయడానికి బజాజ్‌ షోరూమ్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపుతారని డీసీపీ నరసింహ తెలిపారు.

అక్కడి నుంచి క్యూఆర్‌ కోడ్‌తో డబ్బులు పంపిస్తారు. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు డెలవరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ ఛార్జ్‌ బ్యాక్‌ ఆప్షన్‌ ద్వారా తిరిగి డబ్బు పొంది మోసానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

అనంతరం ఆ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. రాజస్థాన్‌కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ఈ ముఠాగా ఏర్పడ్డారని, రెండు నెలలుగా 1,125 లావాదేవీలు నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు. రాజస్థాన్‌కు ప్రత్యేక బృందాలను పంపించి ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

LETEST UPDATE : 

Nalgonda : తప్పుడు పత్రాలతో ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Nirmal : స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు.. నేటికీ వందేళ్లు పూర్తి..!

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

BREAKING : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు..!

మరిన్ని వార్తలు