తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారని వారిని గౌరవించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల లో నిర్మాణంలో ఉన్న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి సందర్శించారు.
ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని, మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారన్నారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.

భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించండని, 2025 మార్చి కల్లా యాదాద్రిలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ ను చేరుకోవాలన్నారు. కూలీలను పెద్ద ఎత్తున పెంచండి. పవర్ ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా ఇతర అవసరాలకు నాలుగు లైన్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచండి అన్నారు.

LATEST UPDATE : 

మిర్యాలగూడ : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం.. దానివల్లనే ప్రభుత్వానికి ఆర్థిక భారం, బట్టి విక్రమార్క వెల్లడి..!

Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు.. కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

మరిన్ని వార్తలు