విద్యుత్ అధికారుల పొలంబాట..!
విద్యుత్ అధికారుల పొలంబాట..!
లక్షెట్టిపేట్, (మన సాక్షి);
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలలో విద్యుత్ అధికారులు గురువారం పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా లక్షెట్టిపేట ఏఈ గణేష్ తమ సిబ్బందితో పొలాలకు వెల్లి వంగిన విద్యుత్ పోల్స్ ను గుర్తించారు.మోటర్లకు కెపాసిటర్స్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్, మోటర్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని లూజ్ కనెక్షన్స్, జాయింట్ వైర్లు చూసుకొని జాగ్రత్తలు పాటించాలని రైతులకు ఏమైనా విద్యుత్ సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా వంగిన స్తంభాలను సరిచేశారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ నర్సింగరావు, ఎల్ఐ లక్ష్మణ్, లైన్ మెన్ నెల్కి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత..!
Peddapalli : భూ ఆక్రమణలపై కఠిన చర్యలు.. అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
Success Story : వ్యవసాయాన్నేి నమ్ముకున్నాడు.. ఏడాదికి కోటి సంపాదన..!









