Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!
Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!
కనగల్, మన సాక్షి:
చదువుతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థానాన్ని పొందవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న కనగల్ మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను ,తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్ లో ఆటలాడుతున్న విద్యార్థులతో మాట్లాడి ఏం ఆటలాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టుల పై వివిధ రకాల అంశాలపై ప్రశ్నలు, జవాబులు అడిగారు. తెలుగు సబ్జెక్టును విద్యార్థులచే చదివించడమే కాకుండా, వాటికి అర్థాలను, వివరాలను అడిగారు.
సాంఘిక శాస్త్రంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గురించి మీకు తెలుసాని కలెక్టర్ అడగగా, విద్యార్థులు తెలుసునని సమాధానాలు చెప్పారు. రాజ్యాంగం, ప్రభుత్వాలు, విధులు, హక్కులు, తదితర అంశాలను విద్యార్థులకు వివరిస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడి చదవాలన్నారు. చదువుతోపాటు, మానవతా విలువలు సామాజిక సేవా దృక్పథం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పాఠశాలలో పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట మహాత్మ జ్యోతిబాపూలే కనగల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్, స్పెషల్ ఆఫీసర్ బిక్షమయ్య తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!
Peddapalli : శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వుల అందజేత..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!










