Miryalaguda : రైతు బిడ్డకు డాక్టరేట్..
Miryalaguda : రైతు బిడ్డకు డాక్టరేట్..
దామరచర్ల, మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డకు డాక్టరేట్ లభించింది. కల్లేపల్లి నివాసి అయిన కుక్కల కార్తీక్ ఖమ్మం యస్ ఆర్ బి జి యన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ సన్ రైస్ యూనివర్సిటీ రాజస్థాన్ నుండి డాక్టరేట్ పొందారని ప్రిన్సిపాల్ డాక్టర్ మమ్మద్ జకీరుల్లా తెలియజేశారు.
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా విశ్వ విద్యాలయం,
విశాఖపట్టణం ప్రొఫెసర్ అయిన గజ్జా యోహన్ బాబు పర్యవేక్షణలో రైతు కథలలో సామాజిక దృక్పథం అనుశీలన అను అంశం పై పరిశోధక గ్రంథాన్ని సమర్పించి నందుకు గాను డాక్టరేట్ పొందారు.
గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ప్రభుత్వ విద్యా సంస్థలలోనే విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించడం పట్ల కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం అభినందనలు తెలియజేశారు.
LATEST UPDATE :
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. కంటెస్టెంట్స్ వీళ్లే..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!









