Suryapet : సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు..!
Suryapet : సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు..!
అర్వపల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యవసాయం దండగ అన్న మాటలు నుండి, వ్యవసాయం పండుగ అనే రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
బుధవారం కొడకండ్ల మండలం బయన్న వాగు దగ్గర శ్రీరాంసాగర్ రెండవ దశ నీటిని సూర్యాపేట జిల్లా కు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు.
సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఈ సీజన్ నుండే ఇస్తామని అన్నారు. శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గం, తోపాటు కోదాడ నియోజకవర్గం లోని కొన్ని మండలాలకు ఈ నీళ్లు వస్తాయని తెలిపారు. దాదాపు రెండు లక్షల 50 ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు.
నిరంతరం సరఫరా చేస్తారా లేక వారబంది ,ద్వారా సరఫరా చేస్తారని అధికారులు ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
LATEST NEWS :
పిల్లిగుండ్ల గణేష్ లడ్డూ వేలం రూ. 2. 20 లక్షలు..!
Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం.. రేపు మంత్రులచే భూమి పూజ..!
Balineni : వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా..!









