District Collector : లేఔట్లలో నిబంధనలు పాటించాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
District Collector : లేఔట్లలో నిబంధనలు పాటించాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సమావేశంలో జిల్లాలోని మక్తల్ మండలానికి సంబంధించి రెండు లేఅవుట్ల కోసం వచ్చిన దరఖాస్తుల పై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఆమె క్లియరెన్స్ అడిగారు.
కాగా వచ్చిన ఆ రెండు లే -అవుట్ ల అనుమతులు జారీకి ఆయా శాఖల అధికారులు శాఖ పరమైన అభ్యంతరాలు తెలిపారు. సమావేశంలో పిఆర్ ఈ.ఈ. హిర్యా నాయక్, ఆర్ అండ్ బి డిఈఈ రాములు, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కిరణ్ పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Nalgonda: నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సంచలన నిర్ణయం.. ఎంపిడిఓ, కార్యదర్శుల సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోకుంటే..!
-
RunaMafi : రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. వారికి మాత్రమే 4వ విడత మాఫీకి కసరత్తు..!
-
Hyderabad : హైదరాబాద్ నుంచి కొత్తగా 6 నగరాలకు నేరుగా విమానాలు..!
-
Ration Cards : తెలంగాణ ప్రజలకు సర్కార్ బిగ్ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!









