Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Peddapalli : జాతీయ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో పోటీల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ..!

Peddapalli : జాతీయ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో పోటీల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ..!

పెద్దపల్లి,  మన సాక్షి ప్రతినిధి :

జాతీయ కుంగ్ ఫూ, కరాటే, తైత్వాండ్ పోటీలలో పెద్దపల్లి జిల్లా విద్యార్థినులు అద్బుత ప్రదర్శన కనబరిచిన వారికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.  గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయస్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సెప్టెంబర్-22న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ లో చీఫ్ ఆర్గనైజర్ సింధు తపస్వి ఇంటర్నేషనల్ క్రీడాకారిణి ఆధ్వర్యంలో జరిగిన మొదటి జాతీయ స్థాయి కుంగ్ ఫూ & కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలలో పెద్దపల్లి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు.

జాతీయ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో పెద్దపల్లి జిల్లా లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి 24 మంది బాలికలు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. వివిధ కేటగిరీలలో బాలికలు 20 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించారని అన్నారు. జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు.

విద్యార్థినులకు కరాటే, కుంగ్ ఫూ, తైత్వాండ్ పై శిక్షణ అందించిన మాస్టర్లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే లెజెండ్ హీరో సుమన్ తల్వార్, మంకీ ఫిస్ట్ కుంగ్ ఫు మాస్టర్
జి. సతీష్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు