తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : మిర్యాలగూడలో రూ 15 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..!

Miryalaguda : మిర్యాలగూడలో రూ 15 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..!

మిర్యాలగూడ, సెప్టెంబర్ 27 , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బధిర విద్యార్థినులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హ్యాండీ క్రాప్స్, కళాకృతుల స్టాల్స్ పలువురుని ఆకట్టుకున్నాయి. స్టాల్స్ ను ప్రారంభించి సందర్శించిన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థినులను అభినందించారు.

వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సందీపరెడ్డిని అభినందించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆమెను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బధిరుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కోర్సు వచ్చే ఏడాది నుంచి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

విద్యార్థులు నైపుణ్యం సాధించేందుకు 15 కోట్ల రూపాయలతో త్వరలో మిర్యాలగూడలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను తయారు చేయాలని, ప్లాస్టిక్ రహిత వస్తువుల వాడకాన్ని పెంచాలని ఆయన కోరారు.

అనంతరం జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడటం వల్ల వారి తరగతి గదులను పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు