Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండపండుగలు

Dussehra Offer : దసరా బంపర్ ఆఫర్.. 51 కొట్టు మేకపోతును పట్టు..!

Dussehra Offer : దసరా బంపర్ ఆఫర్.. 51 కొట్టు మేకపోతును పట్టు..!

చిట్యాల, మన సాక్షి :

దసరా పండుగ వచ్చిందంటే పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది తెలంగాణ పల్లెల్లో అప్పుడే పండుగ వాతావరణం నెలకొన్నది. సాధారణంగా దసరా పండుగ తెలంగాణలో అతిపెద్దది.

ఈ పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దుస్తులతో పాటు గృహప్రకారణాలకు సంబంధించిన వస్తువుల విక్రయాలలో కూడా బడా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ విచిత్రం ఏమిటంటే పల్లెల్లో పండుగ సందర్భంగా యువత బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ యువత దసరా బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. 51 కొట్టు మేకపోతును పట్టు అని సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. కూపన్ ధర 51 రూపాయలు.. లిమిటెడ్ కూపన్స్ మాత్రమే ఉన్నాయి… అంటూ ప్రకటించారు.

మొదటి బహుమతిగా 13 కిలోల మేకపోతు, రెండవ బహుమతిగా 2 రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్స్, మూడవ బహుమతిగా 2 బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బాటిల్స్, నాలుగవ బహుమతిగా 2 నాటు కోళ్లు, అయిదవ బహుమతిగా 12 బడ్ వైజర్ బీర్లు ప్రకటించారు.

అక్టోబర్ 11వ తేదీన ఉదయం 8 గంటలకు వెలిమినేడు గ్రామపంచాయతీ వద్ద డ్రా ఉంటుందని యువత ప్రకటించారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు