Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Devarakonda : వారు 23 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.

Devarakonda : వారు 23 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.

దేవరకొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో 23 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆటపాటలతో రోజంతా గడిపారు. దేవరకొండ పట్టణంలోని విద్యోదయ పబ్లిక్ స్కూల్ 2001-02 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం సునీల్, రామాచారి, రాజేష్, తజ్ముల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఒకరికి పలుకరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అనంతరం ఆనాటి ప్రధానోపాధ్యాయులు కలీం ఉపాధ్యాయుడు చంద్రమౌళి ని సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా…పూర్వ విద్యార్థి మాట్లాడుతూ… మానవ జీవితంలో చదువు అత్యంత కీలకమైందని విద్యార్థి దశ తిరిగి రానిదని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం నేర్చుకున్నామని ఆనాడు పదో తరగతి పూర్వ విద్యార్థులందరూ చాలా చక్కని బాధ్యతలలో ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలలో స్థిరపడ్డారని తెలియజేశారు.

అనంతరం పూర్వ విద్యార్థులందరినీ ఘనంగా శాలువాలతో సత్కరించి మెమొంట్వలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామాచారి తజ్మోల్ రాజేష్ సునీల్ శీను గణేష్ అల్తాఫ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.. అత్యంత ఉత్సాహభరితంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి ఒకరినొకరు తమ బాధలను తమ కష్టాలను తెలియజేశారు.

విద్యార్థి దశ నుండి తల్లిదండ్రుల దశలకు చేరామని భవిష్యత్తులో ఒక ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ సమాజానికి అవసరమైన సేవ అందించాలని మాట్లాడారు. ఉపాధ్యాయులు కలీం, చంద్రకళ, చంద్రమౌళి, రామకృష్ణ, సత్యం, శ్రీను,గోవర్ధన్, పార్ధసారథి, ప్రార్ధన పాల్గున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు