Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : టీచర్ ఉద్యోగాలకు నియామకమైన వారికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అభినందనలు..!

Miryalaguda : టీచర్ ఉద్యోగాలకు నియామకమైన వారికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అభినందనలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

టీచర్ ఉద్యోగాలకు నియామకమైన వారికి మిర్యాలగూడ శాసనభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో DSC – 2024 ద్వారా 144 మంది నూతన ఉపాధ్యాయులు నియామాకమయ్యారు.

బుదవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునే కార్యక్రమానికి వెళుతున్న వారి వాహనానికి జండా ఊపి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతుందని అన్నారు.

నియామకం కాబడిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యారంగమునకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని, వృత్తి నిబద్ధతతో విధులు నిర్వర్తించి నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారులు బాలు, బాలాజీ నాయక్, వెంకన్న, ఆర్ రవి , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు