Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లాలో సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా..!
Suryapet : సూర్యాపేట జిల్లాలో సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా..!
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని గ్రామ శివారు ప్రాంతం గెల్లేరి కుంట నుండి సిరిపురం వరకు గల విద్యుత్ లైనుకు గత ఐదు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని సబ్ స్టేషన్ ముందు శుక్రవారం రైతుల ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంటు ఇవ్వక పొలాలు ఎండిపోతున్నాయని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్పందించడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతుల ఆగ్రహించారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు గుండు చిన్న లింగయ్య గునుగుంట్ల ఆంజనేయులు ఎలక శ్రీనివాస్ రెడ్డి గునుగుంట్ల నరేష్ సోము నరసింహారెడ్డి నక్క లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









