viralBreaking NewsTOP STORIESజాతీయం

Viral Video : సోషల్ మీడియాలో వైరల్ కోసం ఇదేం పని.. దూల తీరింది..!

Viral Video : సోషల్ మీడియాలో వైరల్ కోసం ఇదేం పని.. దూల తీరింది..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కోసం కొత్త కొత్త వీడియోస్ ను తీసి ట్రెండ్ చేస్తున్నారు. అది కాస్త బెడిస్తే ప్రాణాలకే ముప్పు వస్తుంది. అయినా తెలిసి కూడా ఎంతో మంది యువతులు, యువకులు అదే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటిదే ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ కోసం టపాసులు పేల్చడం.. కాస్త మొదటికే మోసం వచ్చి దూల తీరింది. ఓ యువకుడు సోషల్ మీడియాని ఆకర్షించేందుకు మేడపైన స్టాండ్ ఏర్పాటు చేసి కెమెరా ఆన్ చేసి ఎదురుగా బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యాడు. బాంబుకు నిప్పు పెట్టి దానిపైన గ్లాస్ బోర్లించాడు.

అంత వరకు బానే ఉంది. ఆ తర్వాత టపాస్ పేలే సమయంలో సరిగ్గా దానిపైన వెనక్కు తిరిగి నిలబడ్డాడు. పేలుడు దాటికి గ్లాస్ ఎగిరి అతడి బ్యాక్ కు గట్టిగా తగిలింది. దెబ్బకు చుక్కలు కనిపించి దూల తీరింది.

కానీ ఇలా టపాసులు వినూత్నంగా పేల్చడం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై అనేకమంది నేటిజెన్లు వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు. వైరల్ కోసం చూస్తే బ్యాక్ మోత మోగింది.. ఏదో చేయాలంటే ఇంకేదో అయింది.. అంటూ వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు. లక్షల మంది లైకులు, వ్యూస్ లను సొంతం చేసుకుంటుంది.

VIDEO

 

MOST READ : 

మరిన్ని వార్తలు