Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలు

అంగరంగ వైభవంగా విగ్రహాల ప్రతిష్టాపన..!

అంగరంగ వైభవంగా విగ్రహాల ప్రతిష్టాపన..!

కుల్కచర్ల, మన సాక్షి:

శ్రీ రామదూత శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన , ధ్వజస్తంభం, నవగ్రహాలు, నాగులు మరియు బొడ్రాయి (నాభి శిలా) అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ పెద్దలు మరియు ప్రజలు అన్నారు.

కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో బుధవారం గత మూడు రోజుల నుండి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగి నేటితో ముగియడం జరిగింది. అలాగే గ్రామ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో ధ్వజ స్తంభానికి విగ్రహాలకు కలశంతో నీళ్లు పోసి, నవధాన్యాలు ఇచ్చి ముడుపులు చెల్లించుకోవడం జరిగింది.

అలాగే గ్రామ ఆడపడుచులు బోనాలు చేసుకొని ఊరు ఊరంతా తిరుగుతూ ఘనంగా ఊరేగించడం జరిగింది. బోనాలతో పాటు ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో పోతురాజు ల విన్యాసాలు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నాయకులు కరణం ప్రహ్లాద రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అంజయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ ఉప సర్పంచ్ లు, మాజీ వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు