Good News : మీకు ఐదు ఎకరాల లోపు ఉందా.. భారీ గుడ్ న్యూస్, కేంద్రం మరో కొత్త పథకం..!
Good News : మీకు ఐదు ఎకరాల లోపు ఉందా.. భారీ గుడ్ న్యూస్, కేంద్రం మరో కొత్త పథకం..!
మన సాక్షి వెబ్ డెస్క్ :
దేశంలో వ్యవసాయ ఆధారంతో జీవనం సాగించేవారు 70% కు పైగానే ఉన్నారు. అందులో సన్న , కారు రైతులే ఎక్కువగా ఉన్నారు. చిన్న సన్న కారు రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందజేసేందుకు మరో కొత్త పథకాన్ని తీసుకురాలినట్లు తెలిసింది.
ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయం సాగు చేయడం చిన్న రైతులకు చాలా భారంగా మారింది. కూలీ రేట్లు విపరీతంగా పెరగడంతో పాటు పెట్టుబడులు అధికమయ్యాయి. దాంతో చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని గతంలోనే ప్రారంభించింది. రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా 6000 రూపాయలను అందజేస్తున్న విషయం తెలిసిందే.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అందజేస్తున్న ఆర్థిక సహాయం రైతులకు ఏమాత్రం సరిపోవడం లేదని భావించింది. దాంతో మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ ఆశీర్వాద్ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నది. వీరికి వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి సిద్ధమవుతుంది.
ఐదు ఎకరాల లోపు భూములు ఉన్న రైతులకు వారి ఖాతాలలో నేరుగా 25 వేల రూపాయలను జమ చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు 20వేల రూపాయలు, రెండు ఎకరాలు ఉన్న రైతులకు పదివేల రూపాయలు రైతులకు అందజేయనున్నారు.
కాగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ పథకం కూడా వర్తించనున్నది. రైతులకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, భూమి యాజమాన్య పత్రాలు, మొబైల్ నెంబర్ పోర్టరు ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ నూతన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
MOST READ :
-
Viral Video : ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచిన ప్రియురాలు.. ఎందుకో, ఎలా దాచిందో చూస్తే షాక్.. (వీడియో)
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









